ప్రజాశక్తి-రెడ్డిగూడెం
ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం నారా లోకేష్ చేపట్టబోయే 'యువగళం' పాదయాత్రకు ఆంక్షలు, ఆటంకాలు సృష్టిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రెడ్డిగూడెం మండల కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ యువగళంలో ఆరు దాటొద్దు మైకు వాడొద్దు, రోడ్డు మీద మాట్లాడొద్దు అని అంటున్నారు, ఇది తగదని జగన్ రెడ్డి ప్రభుత్వానికి పిచ్చెక్కిందని అన్నారు. ప్రజా సమస్యలు ప్రశ్నించడానికి వస్తుంటే ఇన్ని అడ్డంకులా, ప్రభుత్వం ఇంతలా భయపడాలా ? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల టిడిపి అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు.










