Apr 07,2023 17:40

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి..

యువగళంలో పెద్ద ఎత్తున యువత
- త్వరలో జిల్లాలో మినీ యువగళం
- టిడిపి యువ నేత భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

    యువగళం పేరుతో నారాలోకేష్‌ చేపట్టిన పాదయాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొంటుందని, యువతలో వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని టిడిపి యువ నేత భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాలలోని భూమా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నంద్యాల జిల్లాలో యువగళం జరుగు సమయంలో యువత అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాల్సిన బాధ్యతను నారా లోకేష్‌ తనపై ఉంచారన్నారు. అందులో భాగంగా నంద్యాల పట్టణం నుంచి మినీ యువగళంను ప్రారంభిస్తామని, యువతను ఏకతాటిపై తీసుకొస్తామని పేర్కొన్నారు. శిల్పా వాళ్లు టిడిపిలోకి రావాలంటే ముందుగా శిల్పా మోహన్‌ రెడ్డి, రవి చంద్రలు చంద్రబాబు, నారా లోకేష్‌ల కాళ్లు పట్టుకోవాలని, అప్పుడే తాము పార్టీలోకి స్వీకరిస్తామని అన్నారు. ఈ మధ్య నంద్యాల కేంద్రంగా కార్యక్రమాలు చేస్తున్నారు.. ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి తన తండ్రి భూమా నాగిరెడ్డి విశేష కృషి చేశారని, తప్పక తామ పోకస్‌ నంద్యాలపైనే ఉంటుందన్నారు. పార్టీ అధిష్టానం నంద్యాల సీటు ఎవరికిచ్చినా అందరం కలిసి పని చేస్తామని తెలిపారు.