ప్రజాశక్తి -భీమునిపట్నం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టనున్న పాదయాత్ర యువగళం వాల్‌పోస్టర్‌ను శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, ఇతర నేతలతో కలిసి ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు 400రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల యువగళం పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ, రాష్ట్ర కార్యదర్శి నూకరాజు, పార్టీ మండల అధ్యక్షులు డిఎఎన్ రాజు, మాజీ జెడ్‌పిటిసి సరగడం అప్పారావు, సి సాధికారత, టిడిపి రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ వానపల్లి సత్య, 2,4 వార్డుల అధ్యక్షులు బడిగింటి నీలకంఠం, పాసి నరసింగరావు, 3వ వార్డు ప్రధాన కార్యదర్శి గొలగాని నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ముందుగా చిన బజారు జంక్షన్‌లో ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.










