
ప్రజాశక్తి- చీడికాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రలో యువగళం శ్రేణులపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం వైసిపి దిగజార్చుడు తనానికి నిదర్శనమని మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైలా ప్రసాదరావు విమర్శించారు. మండలంలోని చుక్కపల్లి గ్రామంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, యువగళం పాదయాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన వస్తుందని, దీన్ని వైసిపి తట్టుకోలేక ఇలాంటి దాడులకు పాల్పడు తుందని ఆరోపించారు.ఇటువంటి దమనకాండలతో యువగళాన్ని, తెలుగుదేశం పార్టీని అడ్డుకోలేరని చెప్పారు. దాడి ఘటనలో టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. కొందరు పోలీసు అధికారులు వైసీపీ నేతలకు సహకరిస్తూ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా తయారయ్యారని తెలిపారు.ఇలాంటి అరాచకాలను ప్రజలు గుర్తించారని, వైసిపికి స్వస్తి పలికే రోజులు త్వరలోనే వస్తుందని పైలా అన్నారు. ఈ సమావేశంలో క్లస్టర్ ఇంచార్జిలు రెడ్డి సన్యాసినాయుడు, పేరపు కొండబాబు, చుక్కపల్లి గ్రామ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ పేరపు అప్పారావు, మురుకుటి భోగి నాయుడు, చెట్టుపల్లి సర్పంచ్ గొర్లె గణేష్, రెడ్డి రాము,శరగడం శివ, జాజిమొగ్గల ప్రసాద్, పాతాళం సత్యారావు, పాతాళం గణేష్, కాకర ముసిలి నాయిడు, సేనాపతి జగ్గారావు, విస్సారపు దుర్గారావు, తాటికొండ దేముడు నాయుడు, గట్రేడ్డి కొండల రావు, రాపేటి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.