దుగ్గిరాల: యువగళ యాత్ర రాబోయే ఎన్నికల ప్రక్రియలో యువత ప్రాముఖ్యత నిర్దేశిస్తుందని దానికి యువత సిద్ధంగా ఉండాలని మండల తెలుగుదేశం నాయకులు పిలుపునిచ్చారు. మండల కేంద్రం దుగ్గిరాలలో ఆదివారం జరిగిన యువగళ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. మండల పార్టీ అధ్యక్షులు కె. శ్రీ అనిత మాట్లాడుతూ ఈనెల 15న మంగళగిరి నియోజకవర్గం లో ప్రవేశించనున్న యువగళ యాత్రకు మండలం నుండి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కోరారు. యువత అధ్య క్షులు పి.మహేష్ మాట్లాడుతూ 16న జరగబోయే 'హలో లోకేష్' కార్యక్రమంలో విద్యార్థులు ,యువత పాల్గొని సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో పరిష్కారం పొందవచ్చని అన్నారు. అనంతరం రాష్ట్ర నాయకులు జి.వెంకట్రావు, సీనియర్ నాయకులు కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా యువగళ ంపోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డి. చంటి, వి.నరసింహారావు, కాకా బాబు, జి.శ్రీనివాస్, పి. హర్ష, ఎన్. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.










