Aug 12,2023 23:52

మంగళగిరి/మంగళగిరిరూరల్‌: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో భాగంలో ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం మంగళగిరి నియోజక వర్గంలోకి అడుగు పెట్ట నున్నారు. మంగళగిరి మండలం నిడమర్రు నుండి మంగళ గిరి పట్టణం మీదుగా యర్రబాలెం డాన్‌బాస్కో స్కూల్‌ పక్కనే రాత్రికి బస చేయనున్నారు. 16న 'హలో లోకేష్‌' కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం బస ప్రాంగణ ఏర్పాట్లను నియోజకవర్గ్‌ ఇన్‌ఛార్జి నందం అబద్దయ్య, పార్టీ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణలు పరిశీలించారు. బస ప్రాంగణ పర్యవేక్షకులు ఎ.ఉమా మహేశ్వరరావు, జె. కిరణ్‌ చంద్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంటశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్య క్రమంలో నాయకులు డి.రాజు, వి. పెద్ద లక్ష్మయ్య, కె.అంకమ్మరావు, జి.ధనుంజయరావు, జి.దుర్గా రావు, జి.రంగారావు, పి.మహేష్‌, ఆర్‌.కిరణ్‌ పాల్గొన్నారు.