ప్రజాశక్తి- వెంకటాచలం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో వైసిపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టిడిపి మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ పేర్కొన్నారు. వెంకటాచలంలోని టిడిపి కార్యాలయంలో గురువారం యువ గళం పాదయాత్రను జయప్రదం చేసే నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు మండలం గోపాలపురం వద్దకు 30వ తేదీ సాయంత్రం సాయంత్రం 4 గంటలకు అన్ని గ్రామాల నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున చేరుకొని యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఘన స్వాగతం పలుకుతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే యువగళం పాదయాత్రకు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంయుక్త సారథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బ్రహ్మరథం పట్టనున్నట్లు తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు పార్థసారథి నాయుడు, ఖాయ్యుమ్ ఖాన్, సత్తార్ సాహెబ్, బత్తల రఘురామయ్య, మోడేబోయిన రాజేష్, యమల రాజేంద్ర, పాకం శ్రీకాంత్ రెడ్డి, శ్రీహరి, సాయి, శేఖర్, నితిన్, మహేష్ ఉన్నారు.
పొదలకూరు : టిడిపి జాతీయ కార్యదర్శి లోకేశ్ బాబు యువగళం పాదయాత్ర సర్వేపల్లి నియోజక వర్గంలోకి శనివారం సాయంత్రం ప్రవేశిస్తుందని పాద యాత్రను జయప్రదం చేయాలి టిడిపి మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్, బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు అడపాలసుధాకర్ రెడ్డి, కోడూరు.పెంచల భాస్కర్ రెడ్డి పిలుపు నిచ్చారు. గురువారం వారు ఇక్కడ మాట్లాడారు. శనివారం సర్వేపల్లి నియోజ కవర్గంలోకి లోకేశ్ బాబు పాదయాత్ర కష్ణపట్నం పోర్ట్ సౌత్ గేట్ నుంచి గోపాలపురం వరకు సాగుతుందన్నారు. ఆదివారం సాయంత్రం గోపాలపురం నుంచి గమళ్ల పాలెం వరకు పాదయాత్ర జరుగుతుం దన్నారు. టిడిపి నాయకులు కోవూరు వెంకటేశ్వర్లునాయుడు, ఎస్.కె జమీర్, పి వెంకటరత్నం నాయుడు, కండే.సురేష్ యాదవ్, వి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.










