Jun 29,2023 18:59

మాట్లాడుతున్న రాజా యాదవ్‌

ప్రజాశక్తి- వెంకటాచలం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో వైసిపి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టిడిపి మండల అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్‌ పేర్కొన్నారు. వెంకటాచలంలోని టిడిపి కార్యాలయంలో గురువారం యువగళం పాదయాత్రను జయప్రదం చేసే నేపథ్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం గోపాలపురం వద్దకు 30వ తేదీ సాయంత్రం సాయంత్రం 4 గంటలకు అన్ని గ్రామాల నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఎన్‌టిఆర్‌ అభిమానులు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున చేరుకొని యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఘన స్వాగతం పలుకు తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అది óకారంలోకి రావడం తథ్యమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే యువగళం పాదయాత్రకు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సంయుక్త సారథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బ్రహ్మరథం పట్టనున్నట్లు తెలిపారు. టిడిప సీనియర్‌ నాయకులు పార్థసారథి నాయుడు, ఖాయ్యుమ్‌ ఖాన్‌, సత్తార్‌ సాహెబ్‌, బత్తల రఘు రామయ్య, ఎం రాజేష్‌, యమల రాజేంద్ర, పాకం శ్రీకాంత్‌ రెడ్డి, శ్రీహరి, సాయి, శేఖర్‌, నితిన్‌, మహేష్‌ ఉన్నారు.