Jun 12,2023 00:41

సజ్జా వెంకటేశ్వర్లుకు కేకు తినిపిస్తున్న నారా లోకేష్‌

ప్రజాశక్తి-చీరాల : టిడిపి చీరాల నియోజక వర్గ నాయకుడు సజ్జా వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువ గళం పాద యాత్రలో నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ కట్‌ చేసి సజ్జా వెంకటేశ్వర్లుకు తినిపించారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సజ్జా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలు నారా లోకేషన్‌ సంక్షంలో నిర్వహించు కోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం యువగళం పాదయాత్రలో పాల్గొన్న 150 మంది కార్యకర్తలకు సజ్జా వెంకటేశ్వర్లు తన సొంత నిధులతో ఒక్కొక్కరికీ రూ. 9,600 విలువైన నైక్‌ షూను అందజేశారు. పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు అవసరమైన సందర్భాల్లో అవసరమైన తోడ్పాటును అందించిన సజ్జా వెంకటేశ్వర్లును నారా లోకేష్‌ అభినందించారు. ఇలాంటి సేవలు నిరంతరం కొన సాగించాలని కోరారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండటంలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ విజయానికి కషి చేయాలని కోరారు. గత మూడు రోజులుగా లోకేష్‌ పాదయాత్రలో సజ్జ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.