
యువగళం' పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే బీసీ
ప్రజాశక్తి బనగానపల్లె
బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ యువగళం' పాదయాత్ర లో పాల్గొన్నారు బుధవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోనికి నారా లోకేష్ యువగళం' పాదయాత్ర ప్రవేశించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొని నారా లోకేష్ కు సంఘీభావం తెలిపారు నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'యువగళం' పాదయాత్ర అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం లో ప్రవేశించిన సందర్బంగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి , పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టిడిపి డోన్ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి నారా లోకేష్ ను కలిసి పాదయాత్ర లో పాల్గొన్నారు .