పాదయాత్రలో పాల్గొన్న వేగేశన నరేంద్ర వర్మ
ప్రజాశక్తి- బాపట్ల : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కష్ణ జిల్లాలోకి ఆదివారం ప్రవేశించింది. ఈ సందర్భంగా టిడిపి బాపట్ల ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ నారా లోకేష్‌కు సంఘీభావం తెలిపారు. పాదయాత్ర 2,500 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా నారా లోకేష్‌కు నరేంద్రవర్మ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ గ్రామీణ ప్రాంతంలో యువగళం పాదయాత్ర ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న నరేంద్ర వర్మ గన్నవరంలో నిర్వహిస్తున్న బహిరంగ సభ విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టిడిపి నాయకులతో చర్చించారు.










