Jul 12,2023 22:17

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

'యువగళం' అట్టర్‌ఫ్లాప్‌ : రామిరెడ్డి
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలో జరిగిన లోకేష్‌ యువగళం పాదయాత్ర అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎంఎల్‌ఎ నివాసంలో బుధవారం రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో కనీసం 15మంది ముఖ్య నాయకులు కూడా పాల్గొనలేదన్నారు. పాదయాత్ర అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని, ఈ పాదయాత్ర వల్ల తమ నెత్తిన పాలు పోసినట్టు అయిందని తెలిపారు. తమకు మేలు జరిగిందని తెలిపారు. బిపిఎస్‌ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఫ్లెక్సీలో ఉన్న తన ఫోటోను చూపించి కావలి నియోజకవర్గ అనకొండ అని మారుపేరు తనకు లోకేష్‌ పెట్టారని తెలిపారు. ఆయితే తాను కూడా లోకేష్‌కు మారుపేరు పెడుతున్నానని, ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ లోకేష్‌ను బజ్జీల బుజ్జి కొండా అని పిలవాలని తెలిపారు.
గత టిడిపి హయాంలో చంద్రబాబునాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు కావలి పట్టణానికి ఏం చేశారంటూ ప్రశ్నించారు. ముసునూరులో పేదలందరికీ ఇచ్చిన ఇళ్లల్లో స్వచ్ఛందంగా కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి రూ.35 లక్షలకు, రూ.50 లక్షలకు ప్రభుత్వానికి ఎదురిచ్చి పేదలకు ఇల్లు స్థలం ఇచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని కూడా గుర్తించలేని ఆయన నాయకుడా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ప్రతాపం ఏంటో చూడాలంటే లోకేష్‌ కావలి నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. తాను లోకేష్‌పై 50 వేల మెజార్టీతో గెలుస్తానని, తాను లోకేష్‌పై గెలవలేక పోతే శాశ్వతంగా రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్తానని సవాల్‌ విసిరారు. తన సవాల్‌ను లోకేష్‌ బాబు స్వీకరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, ఎఎంసి చైర్మన్‌ సన్నిబోయిన ప్రసాద్‌యాదవ్‌, బోగోలు మండల కన్వీనర్‌ మద్దిబోయిన వీరరఘ, పట్టణ ఫ్లోర్‌ లీడర్‌ కనుమర్లపూడి నారాయణ, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, శ్రీశైలం ట్రస్ట్‌ సభ్యులు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి, అల్లూరు మండల పార్టీ అధ్యక్షుడు నీలం సాయి, దండ కృష్ణారెడ్డి, వైసిపి నాయకులు ఏగూరి చిన్న పుల్లయ్య, కుందుర్తి కామయ్య, కుందుర్తి శ్రీనివాసులు నాగేశ్వరమ్మ, మహేశ్వరీ, వైస్‌ ఎఎంసి చైర్మన్‌ ఓటు శ్రీకాంత్‌, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.