Aug 16,2023 23:08

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ఈ నెల 19న విజయవాడ చేరుకుంటుందని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యువత తరలివెళ్లాలని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీరామ్‌ రాజగోపాల్‌ పిలుపునిచ్చారు. బుధవారం మండల అధ్యక్షులు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ మాట్లాడుతూ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. అన్ని గ్రామాల నుంచి ప్రజలు వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కట్టా వెంకట నరసింహారావు, మేక వెంకటేశ్వర్లు, చింతల సీతారామయ్య, వడ్లమూడి రాంబాబు, ముల్లంగి రామకష్ణారెడ్డి, యానాల గోపి, చావా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-నందిగామ: యువగళం పాదయాత్ర చూసి వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదని విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ టిడిపి నాయకులు కేశినేని శివనాథ్‌, నందిగామ మాజీ ఎంఎల్‌ఎ తంగిరాల సౌమ్య విమర్శించారు. నందిగామ పట్టణంలోని తంగిరాల సౌమ్య కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గం నుంచి టిడిపి నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లి లోకేష్‌ పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు ఏచూరి రాము, కౌన్సిలర్‌ కమోసాని సత్యవతి, టిడిపి నాయకులు ఎండ్రపల్లి శ్రీనివాసరావ , కోగంటి బాబు, రాజా, సైదా, కొండూరు వెంకట్రావు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: యువగళం మహా పాదయాత్రను విజయవంతం చేయాలని కేశినేని శివనాద్‌ (చిన్ని) పిలుపునిచ్చారు. బుధవారం నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గం నుండి 20 వేల మంది తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి శావల దేవదత్తు తదితరులు పాల్గొన్నారు.