ప్రజాశక్తి - పాలకొండ రూరల్ : వైసిపి వైఫల్యాలను ఎండగడుతూ, భవిష్యత్తుపై ప్రజలకు భరోసానిస్తూ సాగుతున్న టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమకాలీన రాజకీయాల్లో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తోందని పాలకొండ నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ అన్నారు. యువగళం పాదయాత్ర 2వేల కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా యువనేతకు శుభాకాంక్షలు తెలియచేస్తూ సంఘీభావంగా పాలకొండ మండలం గొట్టమంగళాపురంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కర్నెన అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, సీనియర్ నాయకులు కిమిడి కాశింనాయుడు, జాడ శ్రీధర్, తెలుగు యువత అధ్యక్షులు సిరిపురం జగదీశ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు జీలకర్ర మోహన్ రావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు సురవరం సుందర్ రావు, మరియు కమిటీ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, కార్యకర్తలు పాల్గోన్నారు.










