Jan 27,2023 22:47

ప్రజాశక్తి-జగ్గయ్యపేట 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్‌ యువ గళం పేరుతో కుప్పం నుంచి చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా జగ్గయ్యపేట పట్టణంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీరామ్‌ సుబ్బారావు, యువ నాయకులు నెట్టెం శివరాం, శ్రీరాం ధనుంజయ చినబాబు ల ఆధ్వర్యంలో శుక్రవారం జగ్గయ్యపేట పట్టణం నుండి తిరుమలగిరి గ్రామం వరకు పాదయాత్ర చేపట్టారు. మొదటిగా బంగారపు కోట్ల సెంటర్‌ వద్ద గల విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్దకు చేరుకొని ముస్లిం పెద్దలతో, క్రైస్తవ పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ, మండల నియోజకవర్గ, జిల్లా ,రాష్ట్ర స్థాయి నాయకులు, మహిళలు, అభిమానులు, సానుభూతిపరులు, యువకులు పాల్గొన్నారు.