Apr 27,2023 21:12

ఎల్లార్తిలోని దర్గాను దర్శించుకున్న వైకుంఠం మల్లికార్జున చౌదరి, టిడిపి కన్వీనర్‌ లాయర్‌ షేక్షావలీ

ప్రజాశక్తి - చిప్పగిరి
టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రకు ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఆలూరు మాజీ ఇన్‌ఛార్జీ వైకుంఠం మల్లికార్జున చౌదరి తెలిపారు. గురువారం చిప్పగిరి టిడిపి కన్వీనర్‌ లాయర్‌ షేక్షావలీ ఎల్లార్తిలోని దర్గాలో తందూరి కార్యక్రమం నిర్వహించారు. టిడిపి కన్వీనర్‌ లాయర్‌ షేక్షావలీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వైకుంఠం మల్లికార్జున చౌదరి పాల్గొని దర్గాలోని స్వాములను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు, అధికారులు విసుగు చెందుతున్నారని తెలిపారు. ఆ వ్యతిరేకత వల్లే ఈనాడు చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మాజీ ఎంపిపి రామచంద్ర నాయుడు, టిడిపి సీనియర్‌ నాయకులు పాములు సన్నప్ప, భీమ లింగప్ప, మాజీ కన్వీనర్‌ కిష్టప్ప, తిమ్మయ్య, మాజీ ఎంపిటిసి భాస్కర్‌, దూదేకుల ఛైర్మన్‌ సాలీ సాహెబ్‌, లాయర్‌ ప్రవీణ్‌, గౌతం, శివలింగ, అమరేష్‌, గుర్రం హరి, జహీర్‌ పాల్గొన్నారు.