యువగళం పాదయాత్రకు ఆహ్వానం పలుకుతున్న యువత, మహిళలు
ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి పట్టణంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం సాయంత్రం జరుగుతున్న లోకేష్ యువగళం పాదయాత్ర, పాత బస్టాండ్ సెంటర్‌లో జరిగే భారీ బహిరంగ సభ జరుగుతున్న సందర్భంగా పట్టణ టిడిపి సీనియర్ నాయకులు, అద్దంకి మేజర్ పంచాయతీ 4వ వార్డు మాజీ మెంబర్ రాంశెట్టి రవి ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని 5వ వార్డు పరిధిలోని ఎస్‌బిఐ రోడ్, సాయి నగర్‌లలో శుక్రవారం ఇంటింటికీ తిరుగుతూ మహిళలను కలుస్తూ టిడిపి యువగళం పాదయాత్ర ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.










