ప్రజాశక్తి-పెందుర్తి : టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న 'యువగళం' పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు ఆధ్వర్యాన పెందుర్తి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టారు. పాదయాత్ర దిగ్విజయంగా పూర్తికావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోకేష్ చేస్తున్న యువగళానికి మంచి స్పందన వస్తుందన్నారు. ఆయన పాదయాత్ర చేస్తుంటే వైసిపి నాయకుల్లో దడ పుడుతుందని పేర్కొన్నారు. 2024లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అవగడ్డ అప్పలనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు కరక దేముడు, రెడ్డి నారాయణరావు, కొరుబిల్లి సుందరరావు, దాట్ల మధు, కాగిత రమణ, శ్రీను యాదవ్, గొంప త్రినాధ్, జిల్లా తెలుగు యువత నాయకులు డైలీ రమణ, గంతకొరు శ్రీను, గాంతకోరు శివ,దాసరి గణేష్, ఇప్పులి శివ, హేమంత్, చక్రి పాల్గొన్నారు.










