Aug 17,2023 18:35

మైలవరంలో విలేకరులతో మాట్లాడుతున్న దేవినేని ఉమా


మాజీ మంత్రి దేనిని ఉమ
ప్రజాశక్తి - మైలవరం : టిడిపి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను జయప్రదం చేయాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరావు పిలుపునిచ్చారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో ప్రభుత్వం సైకో చేష్టలు చివరి స్టేజ్‌కు చేరుకున్నాయన్నారు. తిరుమలకు వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. యువగళం పాదయాత్ర బ్యానర్లు తీసేస్తున్నారని జెండాలు కట్టవద్దని భోజనాలు పెట్టే రైతులను బెదిరిస్తున్నారని అన్నారు. దేశ మహానుభావుల విగ్రహాలను నందిగామ మున్సిపల్‌ కార్యాలయం మరుగుదొడ్ల వద్ద పారవేశారని ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.