May 15,2023 23:33

పెద్దాపురంలో ఎంఎల్‌ఎ చినరాజప్ప ఆధ్వర్యంలో పాదయాత్ర


ప్రజాశక్తి - పెద్దాపురం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా పెద్దాపురంలో ఎమ్మెల్యే నిమ్మకాయలు చిన రాజప్ప ఆధ్వర్యంలో సోమవారం సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజు ఇంటి వద్ద నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర పట్టణ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు,టిడిపి నాయకులు రంది సత్యనారాయణ, కొత్తిం వెంకట శ్రీనివాసరావు, తూతిక రాజు,ఎలిశెట్టి నాని,కొరిపూరి రాజు, మొయిళ్ళ కృష్ణమూర్తి, గోపాలకృష్ణ, అరవింద కుమార్‌,నూనె రామారావు,కందుల విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ : కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ సిటీ నియోజకవర్గం మెయిన్‌ రోడ్‌ టౌన్‌ హాల్‌ సెంటర్‌ నుండి మెయిన్‌ రోడ్డు నగరంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్‌, బచ్చుశేఖర్‌, అమన్‌ జైన్‌, నసింహదేవర విశ్వనాథం, గదుల సాయిబాబా, పంతాడు రాజు, ఓమ్మి బాలాజీ, బంగారు సత్యనారాయణ, అంబటి చిన్న, గుజ్జు లక్ష్మణరావు, గాది శివరామకష్ణ, ఎండి ఆన్సర్‌, జిలాని, తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.