Nov 19,2023 00:05

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: యుటిపి కేసులు త్వరగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్‌, అటవీశాఖ అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు సూచించారు. శనివారం ఎస్టేట్‌లోని జిల్లా కోర్టు జడ్జి ఛాంబర్‌లో ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని యుటిపి, వివిధ రకాల కేసులకు సంబంధించి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల రెవెన్యూ, పోలీస్‌, అటవీ, జైలు శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ జైలులో మగ్గుతున్న ఖైదీలకు సంబంధించి కేసులు త్వరితగతిన పరిస్కారించుటకు సమన్వయ కమిటీ నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అక్టోబర్‌ 31 వరకు 43,055 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అక్టోబర్‌1 నుండి అక్టోబర్‌ 31 నాటికి 688 కేసులు డిస్పోజల్స్‌ చేయడం జరిగిందన్నారు. ఎన్‌బిడబ్య్లుఎస్‌ కేసులు అక్టోబర్‌ 31 నాటికి 4352 ఉన్నాయని అందులో 1088 పోలీస్‌ కేసులు, 1692 ఎన్‌ఐ ఆక్ట్‌ కేసులు, 131 ఎక్సైజ్‌ కేసులు, 3 మెయింటినెన్స్‌ కేసులు, 1438 ఇతర రకాల కేసులు, 2019 నుండి 1812 ఎన్‌బిడబ్య్లుఎస్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జిల్లాల వారిగా ఎన్‌బిడబ్య్లుఎస్‌ కేసుల వివరాలు, చిత్తూరు జిల్లాలో 329 క్రిమినల్‌ కేసులు, 549 ఎన్‌ఐ ఆక్ట్‌ కేసులు, తిరుపతి జిల్లాలో 554 క్రిమినల్‌ కేసులు, 531 ఎన్‌ఐ ఆక్ట్‌ కేసులు, 131 ఎక్సైజ్‌ కేసులు, 3 మెయింటినెన్స్‌ కేసులు, అన్నమయ్య జిల్లాలో 205 క్రిమినల్‌ కేసులు, 269 ఎన్‌ఐ ఆక్ట్‌ కేసులు, 343 ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో గత సెప్టెంబర్‌ 30 నాటికి ఎన్‌బిడబ్య్లుఎస్‌ 4,455 కేసులు పెండింగులో ఉన్నాయని, అక్టోబర్‌ 31 నాటికి 4,352 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి,సెప్టెంబర్‌ 30 నుండి అక్టోబర్‌ 31 నాటికి 103 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు.
సమావేశంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ మూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి , సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ ఐ.కరుణకుమార్‌, డిఆర్‌ఓ.యన్‌.రాజశేఖర్‌, జిల్లా జైల్‌ సూపర్‌ డెంట్‌ వేణుగోపాల్‌ రెడ్డి, అటవీశాఖ అధికారి చైతన్య కుమార్‌ రెడ్డి, డిఎస్పీ శ్రీనివాస్‌ మూర్తి. తిరుపతి, అన్నమయ్య జిల్లాల రెవెన్యూ, పోలీస్‌, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.