కడప అర్బన్ వైఎస్‌ఆర్ కడప జిల్లా యుటిఎఫ్ నూతన కమిటీని ఆదివారం నగరంలోని యుటిఎఫ్ భవన్ లో నిర్వహించి జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎన్.నాగార్జున రెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా మాదన విజయ కుమార్, సహాధ్యక్షులుగా వై.రవికుమార్, డి.సుజాత రాణి, ప్రధాన కార్యదర్శిగా పాలెం మహేష్ బాబు, ట్రెజరర్ గా కె.నరసింహారావు, కార్యదర్శులుగా చెరుకూరి శ్రీనివాసులు, డి.వి.రవీంద్రుడు, కె.చెన్నయ్య, డి.గురుప్రసాద్, సి.వి.రమణ, వి.పర్వీన్, ఎస్.ఏజాక్ అహ్మద్, వి.మురళీకష్ణ, ఎల్.చంద్ర ఓబుల్ రెడ్డి, ఎ.శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పాలెం మహేష్ బాబు, మాదన విజయకుమార్, డి.రూతు ఆరోగ్య మేరీ, ఎస్.ఓబుల్ రెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా ఎం.ప్రభాకర్, ఆడిట్ కమిటీ సభ్యులుగా యస్.శశిధర కుమార్, ఎం.సుందరం, జి.రవిశంకర్,టి.శివ ప్రసాద్, టి.వి.రమణ, సీపీఎస్ జిల్లా కన్వీనర్ గా సి.సుదర్శన్, కోకన్వీనర్లుగా ఎస్.కరీముల్లా, ఎన్.పవన్ కుమార్, కె.గంగయ్య , ఎన్.అయ్యవారు రెడ్డి ఎన్ని కయ్యారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్.నాయుడు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా మరో రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీ రాజా పరిశీలకులుగా వ్యవహరించారు. నూతన జాతీయ విద్యా విధానం అమలును ఆపివేయాలని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్థానంలో జిపిఎస్ విధానాన్ని కాకుండా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను తక్షణమే చెల్లించాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్‌ను అమలు చేయాలని, మున్సిపల్, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయాలని, పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని, ప్రతి నెలా 1 నే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కౌన్సిల్ సమావేశం తీర్మానాలను ఆమోదించింది.