Oct 10,2023 22:41

నివాళులర్పిస్తున్న బాబూరావు, డివి.కృష్ణ

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : యుటిఎఫ్‌ ఉద్యమ సీనియర్‌ నాయకులు గోకినేని లక్ష్మీనారాయణ అనారోగ్యం కారణంగా సోమవారం అర్థరాత్రి మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 76 సంవత్సరాలు 1966లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. 2005లో ఉద్యోగ విరమణ చేశారు. విజయవాడ నగరంలో కృష్ణాజిల్లాలోనూ ఉపాధ్యాయ సంఘంలో యుటిఎఫ్‌ నిర్మాణం ప్రారంభం నుండి ముఖ్య కార్యకర్తగా పనిచేస్తూ అన్ని ప్రజా సంఘాల ఉద్య మాలు, కమ్యూ నిస్టు ఉద్యమాలలోనూ చురు కుగా పాల్గొ న్నారు. ఉపా ధ్యాయ ఉద్యమ నాయ కులు కోడూరి నారాయణరావు, ఎ.వెంకటస్వామి, మైనేని వెంకటరత్నం, ముత్తారావులకు అన్ని విధాలుగా సహకారం అందించారు. లక్ష్మీనారాయణకు ఇరువురు కుమార్తెలు కరుణ, కవిత ఉన్నారు. నగరంలోని బృందావన్‌ కాలనీలోని వారి నివాసంలో లక్ష్మీనారాయణ భౌతిక కాయాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌. బాబూరావు సందర్శించి ఎర్రజెండా కప్పి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం సీనియర్‌ నాయకులు పి.మధు, సిహెచ్‌. నరసింగరావులు తమ సంతాపం తెలిపారు.