Sep 26,2023 22:38

ప్రజాశక్తి-యంత్రాంగం
యుటిఎఫ్‌ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన జాతా మంగళవారం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పలు చోట్ల సాగింది. ఈ సందర్బంగా జిల్లాలో యుటిఎఫ్‌ జాతాలకు ఘన స్వాగతం లభించింది. వచ్చేనెల 1న విజయవాడలో నిర్వహించే స్వర్ణోత్సవ సభకు అందరూ తరలిరావాలని యుటిఎఫ్‌ నాయకులు పిలుపునిచ్చారు.
మండపేట యుటిఎఫ్‌ జాతాకు జిల్లా ఆడిట్‌ కమిటీ మెంబర్‌ కొవ్వూరి గోపాలకష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండపేటలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక కరాచీ సెంటర్‌ లో యుటిఎఫ్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర డివి.రాఘవు, ప్రధాన కార్యద కెఎస్‌ఎస్‌.ప్రసాద్‌లు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉన్నతికి కషి చేసిన సంఘం యుటిఎఫ్‌ అని పోరాట పటిమకు నిలువెత్తు నిదర్శనం ఈ జెండా అన్నారు. అక్టోబర్‌ 1న స్వర్ణోత్సవ సభకు అందరూ రావాలన్నారు. కార్యక్రమంలో గారా చిట్టిబాబు, గంటి వీర్రాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జ్యోతిబసు, పి. వెంకటేశ్వ రరావు, సురేంద్ర, గోపిమూర్తి, ఎం.త్రినాధరావు, తాడి శ్రీనివాస్‌, పిఆర్‌సి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబాజీపేట ప్రపంచీకరణ నేపథ్యంలో కనుమరుగవుతున్న హక్కులను నిలబెట్టుకుని కొత్త హక్కుల సాధన మన ఉద్యమం ప్రధాన కర్తవ్యంగా తీసుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డివి.రాఘవులు పిలుపిచ్చారు. వచ్చేనెల 1న విజయవాడలో జరిగే స్వర్ణోత్సవాల సభను జయప్రదం చేయాలని అన్నారు. అంబాజీపేటలో యుటిఎఫ్‌జాతా పర్యటించింది. జిల్లా అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతి బసు ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు జివి.రమణ, ఎంటివి.సుబ్బారావు, జిల్లా కార్యదర్శ పి. శ్రీనివాసరావు, మురళి, మురుగేష్‌, సిహెచ్‌.కేశవరావు, వి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. అమలాపురం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు పాఠశాలలో విద్యార్థుల సమస్యలపై పోరాటంలో యుటిఎఫ్‌ ముందు భాగంలో ఉందని రాష్ట్ర కోశాధికారి బి.గోపి మూర్తి అన్నారు. విద్యార్థుల హక్కులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం యుటిఎఫ్‌ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా అన్నారు. రాష్ట్రంలో విద్యారంగ సంస్క రణలకు వ్యతిరేకంగా యుటిఎఫ్‌ కార్యక్రమాలు రూపొందించుకుని పోరాటం చేస్తోందని రాష్ట్ర కార్యదర్శి డివి.రాఘవులు అన్నారు. రామచంద్రపురం, మండపేట రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట మీదుగా యుటిఎఫ్‌ జాతా అమలాపురం యుటిఎఫ్‌ హోమ్‌ వద్దకు చేరుకుంది. తొలుత యుటిఎఫ్‌ హోమ్‌ వద్ద యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు కడలి సత్యనారాయణ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు ఎంటి వి.సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్య దర్శి జ్యోతి బసు మాట్లాడుతూ వివిధ అంశాలపై పోరాటాల్లో యుటిఎఫ్‌ అగ్రభాగాన నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్‌ అధ్యక్షులు పి.సురేంద్ర కుమార్‌ పిఎస్‌.శిరోమణి, జిల్లా కార్యదర్శి జివి.రమణ, టి.దుర్గాప్రసాద్‌, సిహెచ్‌ కేశవరం, పెన్నాడ శ్రీనివాస్‌, వై.మురళీమోహన్‌, వైవిఎస్‌ఎన్‌.బాలాజీ, కొప్పిశెట్టి శ్రీనివాస్‌, కడలి సత్యనారాయణ, జివి.గోపాలకృష్ణ, వి.బానోజీ రావు ఆర్‌ వీరస్వామి, మురుగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.