Sep 26,2023 23:02

ప్రజాశక్తి-హనుమాన్‌ జంక్షన్‌: ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ యుటిఎఫ్‌ స్థాపించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ ప్రారంభ వేడుకలు విజయవంతం చేయాలని యుటిఎఫ్‌ కష్ణాజిల్లా కార్యదర్శి వెలమర్తి రవిబాబు పిలుపునిచ్చారు. స్వర్ణోత్సవాలకు సంబంధించిన గోడపత్రిక పోస్టర్‌ను స్థానిక గీతాంజలి హైస్కూల్లో యుటిఎఫ్‌ బాపులపాడు మండల శాఖ సభ్యులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన బైక్‌ ర్యాలీ ఈ నెల 28న సాయంత్రం హనుమాన్‌ జంక్షన్‌ చేరుకుంటుందని రవిబాబు తెలిపారు. కష్ణాజిల్లా పక్షాన జిల్లా ప్రధాన కార్యదర్శి జై లెనిన్‌ బాబు, అధ్యక్షులు బి కనకారావు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరావు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి మరీదు వరప్రసాద్‌, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు వరప్రసాద్‌, భగీరథ హాజరవుతారని రవిబాబు తెలిపారు. వచ్చే అక్టోబర్‌ ఒకటో తేదీ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ కానూరు వేదికగా విజయవాడలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ స్వర్ణోత్సవ ప్రారంభ వేడుకలు జరుగుతాయని యుటిఎఫ్‌ కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎంఎస్‌ఆర్‌ ప్రసాద,్‌ జనవిజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు వీడిఎస్‌ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి దారపురెడ్డి భాస్కరరావు పాల్గొన్నారు.