
ప్రజాశక్తి - చీరాల
అక్టోబర్ 1న విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో యుటిఎఫ్ స్వర్ణోత్సవాల సభ జరుగుతుందని అందరూ జయప్రదం చేయాలని యుటిఎఫ్ నాయకులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావం జరిగి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ సోమవారం చీరాల ప్రాంతీయ నూతన కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా సహాధ్యక్షులు బండి భిక్షాలుబాబు, జిల్లా కార్యదర్శి షేక్ జానీబాషా, సీనియర్ నాయకులు కె.వీరాంజనేయులు, జి.సూరిబాబు, జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు, ఎయిడెడ్ జిల్లా కన్వీనర్ కుర్ర శ్రీనివాసరావు, పట్టణ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెలిగొండ రెడ్డి, ఎస్‌వి.సుబ్బారెడ్డి, చీరాల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, నాగమల్లేశ్వరరావు, వేటపాలెం నాయకులు మాల్యాద్రి, రాజేష్, హేమంత్ కుమార్ పాల్గొన్నారు.