Sep 28,2023 22:49

ప్రజాశక్తి-ఉయ్యూరు : ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (ఏపీ యుటిఎఫ్‌) స్వర్ణోత్సవ వేడుకలను జయప్రదం చేయా లని తోట్లవల్లూరు మండల శాఖ ఆధ్వ ర్యంలో గోడ పత్రికను ఆవిష్కరిం చారు. తోట్లవల్లురు మండల శాఖ నూతన కౌన్సిల్‌ సమావేశం గురువారం నా గళ్ళ రాజేశ్వ రమ్మ జానకి రామయ్య విజ్ఞాన కేంద్రనందు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల అధికారిగా సీతా రామయ్య, జిల్లా కమిటీ కన్వీనర్‌ శ్రీ ఎల్‌. నరేంద్ర, జిల్లా కార్యదర్శి అబ్దుల్‌ హబీబ్‌ ఆధ్వర్యంలో జరిగింది. ప్రభుత్వము ఉద్యోగ సంఘాలు వద్దని చెప్పినా వినకుండా జిపిఎస్‌ బిల్లును చట్టం చేసినందుకు నిరసనగా జిపిఎస్‌ జీవో కాపీల ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో తోట్లవల్లూరు మండలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా విష్ణువర్ధన్‌, అధ్యక్షులుగా సిహెచ్‌. మైథిలి, సహధ్యక్షులుగా పి పి అహ్మద్‌ బాబు, కోశాధికారిగా సి హెచ్‌ ఎల్‌ వి పమిడేశ్వ రరావు, ప్రధాన కార్యదర్శిగా కుమారి ఎం. విజయాద్రి ఎన్నికయ్యారు. వారితో పాటు కార్యదర్సులుగా పి. అనూష, ఏ. బాలాజీ, షేక్‌ రియాజ్‌ బాషా, ఏ నాగబాబు, ఎం. జయప్రకాష్‌, సిహెచ్‌. పార్వతి, ఏ. సునీత ఎన్నికయ్యారు. ఆడిట్‌ కన్వీనర్‌ గా శ్రీ . పి ఎన్‌ డి. ప్రసాద్‌ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో అక్టోబర్‌ 1వ తేదీన కానూరు సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ లో జరిగే స్వర్ణోత్సవ వేడుకలకు కష్ణాజిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్ని కార్య క్ర మాన్ని విజయవంతం చేయాలని కృష్ణా జిల్లా కార్యదర్శి అబ్దుల్‌ హబీబ్‌ కోరారు.