ప్రజాశక్తి - మార్టూరు రూరల్
యుటిఎఫ్ మండల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులుగా బొల్లాపల్లి ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బండారు ఆదినారాయణ, మార్టూరు ఎంపీయూపి పీర్లచావిడీ ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పోపూరి సునీల్ కుమార్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన యుటిఎఫ్ సర్వసభ్య సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు నూతన కమిటీ ఎన్నికలను పరిశీలించారు. మచ్చ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా బొప్పూడి ప్రతాప్, ఉపాధ్యక్షులుగా జి యెహోషువ, ఎ అన్నపూర్ణాదేవి, కోశాధికారిగా అట్లూరి ప్రశాంత్, కార్యదర్శులుగా ఆర్ ఎల్లమందయ్య, వివి రామాంజలి, డి రవిదేవరాజ్, ఎ చార్లీ బెంజిమిన్, డి వసంతరావు, పి నారాయణరెడ్డి, జానీబాషా, జిల్లా కౌన్సిలర్లుగా చట్టి శ్రీనివాసరావు, చెన్నకేశవులు, శ్రీనివాసులు, రామ్ నాయక్, ఈమని సత్యవర్దిని, షేక్ మౌలాలి ఎంపికయ్యారు. ఎన్నికల అధికారిగా యూటీఎఫ్ జిల్లా నాయకులు కందిమళ్ల రవిబాబు వ్యవహరించారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన యూటీఎఫ్ నాయకులు ప్రకటించారు.