Oct 14,2023 20:42

సీతానగరం: ఎంఇఒకు వినతి పత్రాన్నిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి - సీతానగరం : మండల కేంద్రంలో గల స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో యుటిఎఫ్‌ నూతన మండల కార్యవర్గం ఎన్నిక జిల్లా పరిశీలకులు భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగింది. మండల గౌరవాధ్యక్షులుగా తీళ్ల మధుసూదన్‌రావు, అధ్యక్షులుగా పల్లె శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శిగా బొత్స ప్రసాదరావు, సహాధ్యక్షులుగా తెర్లి అప్పలనాయుడు, కూన లక్ష్మి, కోశాధికారిగా డివి రమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్నిక అనంతరం ఎంఇఒను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై ప్రాతినిధ్యం చేశారు.
గుమ్మలక్ష్మీపురం కార్యవర్గం ఇదే
గుమ్మలక్ష్మీపురం: యుటిఎఫ్‌ మండల నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా కొండగొర్రి భాస్కరరావు, అధ్యక్షులుగా పత్తిక శంకర్‌ రావు, ప్రధాన కార్యదర్శిగా పత్తిక ప్రసాదరావు ఎన్నికయ్యారు. సహాధ్యక్షులుగా ఆరిక జగదీశ్వరి, కిల్లక రవి, కోశాధికారిగా డి సిహెచ్‌ నారాయణ, ఆడిట్‌ కన్వీనర్‌గా జీలకర్ర అజరు కుమార్‌ ఎన్నికయ్యారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు తోట రమేష్‌, కార్యదర్శి బిడ్డిక కూర్మారావు, నిమ్మక శ్రీరాములు సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.