
ప్రజాశక్తి - చీరాల
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు నాగటి నారాయణరావు ప్రథమ వర్ధంతి సభ యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈరోజు ఉపాధ్యాయుల అనుభవిస్తున్న మెరుగైన పిఆర్సీలు, ఎఎస్ఎస్ మరెన్నో సౌకర్యాలు నాటి నాయకుల కృషి ఫలితమేనని అన్నారు. నాగటి నారాయణ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. అనంతరం సిపిఎస్ రద్దుచేసి జిపిఎస్ ఆర్డినన్స్ చట్టాన్ని నిలిపివేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. సిఎం తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ పద్మావతి, జిల్లా సహాధ్యక్షులు బి భిక్షాలుబాబు, జిల్లాకార్యదర్శి షేక్ జానీబాషా, జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు, జిల్లా ఎయిడెడ్ కన్వీనర్ కుర్రా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కె వీరాంజనేయులు, జి సూరిబాబు, భవనం శ్రీనివాసరెడ్డి, వెలుగొండారెడ్ది, రాజేష్, ఎం శ్రీనివాసులు, నాగమల్లేశ్వరరావు, వీరప్రసాద్, పి శ్రీనివాసరావు, సిహెచ్ వెంకటేశ్వర్లు, మాల్యాద్రి, విజయవర్ధనరావు పాల్గొన్నారు.