
ప్రజాశక్తి - యంత్రాంగం జిల్లాలోని పలు మండలాల్లో యుటిఎఫ్ మండల కమిటీల ఎన్నికలు జరిగాయి. నల్లజర్ల స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాలలో మండల నూతన కౌన్సిల్ ఎన్నిక జరిగింది. మండల గౌరవ అధ్యక్షులు పల్లి వెంకట అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికకు జిల్లా గౌరవ అధ్యక్షులు హుస్సే శంకరుడు ఎన్నికల అధికారిగా, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్‌ఎస్‌ఎస్.మనోహర్‌కుమార్ పరిశీలకులుగా వ్యవహరిం చారు. కమిటీ గౌరవాధ్యక్షులు పివి.అప్పారావు, అధ్యక్షులుగా ఎస్.ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, అసోసియేట్ అధ్యక్షులు జి.చిట్టిబాబు, మహిళా అధ్యక్షురాలు కె.కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి బి.కిషోర్, కోశాధికారి జి.కృష్ణ బాలాజీ, ఇతర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోకవరం యుటిఎఫ్ మాజీ అధ్యక్షుడు ఎన్.అనిల్‌కుమార్ అధ్యక్షతన యుటిఎఫ్ మండల కమిటీ ఎన్నిక అయ్యింది. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో మండల యూటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆర్.హరనాథ్, పివివిఎస్‌ఆర్.త్రిమూర్తులు, గౌరవాధ్యక్షులుగా ఎస్.కుమార్, కోశాధికారిగా టివివిఆర్‌ఎల్.నారాయణరావు, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాళ్లపూడి స్థానిక పరస పద్మ రాజారావు జడ్‌పి ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సంఘం నూతన అధ్యక్షులుగా టి.క్రాంతి కుమార్, గౌరవ అధ్యక్షులుగా కె.రాజకుమారి, ప్రధాన కార్యదర్శిగా బి.విజయబాబు కోశాధికారిగా టి. వెంకటరమణ, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.