ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులు
ప్రజాశక్తి -కోటవురట్ల:మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ మండల ఎన్నిక కమిటీ
ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. యుటిఎఫ్ మండల అధ్యక్షులుగా జవ్వాది నర్సింగరావు, గౌరవ అధ్యక్షులుగా అడిగర్ల సత్యనారాయణ, మండల కార్యదర్శిగా గంట్యాడ అప్పలరాజు, కోశాధికారిగా గిడుతూరి రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










