ప్రజాశక్తి- అడ్డతీగల
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) మండల నూతన కార్యవర్గం ఎన్నిక మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఎన్నికల అధికారిగా యుటిఎఫ్ జిల్లా కోశాధికారి కె.కృష్ణ వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకులుగా జిల్లా కార్యదర్శి సోర్లం రాజుబాబు, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ తేజోరావు హాజరయ్యారు. యుటిఎఫ్ మండల గౌరవాధ్యక్షులుగా ఎస్.నాగప్రసాద్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బొంకు దొరబాబు, లోతా మధు రెడ్డి, మండల సిపిఎస్ కమిటీ కన్వీనర్‌గా చారపు చినబాబు దొర, ఉపాధ్యక్షులుగా కె.శ్రీనివాస్, కె.కమల రత్నం, కోశాధికారిగా కెవి.రాఘవులు ఎన్నికయ్యారు. ఎఫ్‌డబ్ల్యుఎస్ కార్యదర్శిగా జగదీష్, పత్రిక కార్యదర్శిగా పి.వెంకట రమణ, ఆడిటర్‌గా చింతోజీ, నాగేశ్వరరావు, కార్యదర్శులుగా పి.అప్పారావు, సిహెచ్.లోవరాజు, వి.బాలరాజు, డి.అశోక్, జి.వెంకటరమణ, సిహెచ్.సాయిప్రసాద్, ఎస్.కుశలన్న, జిల్లా కౌన్సిలర్లుగా జి.తేజరావు, సిహెచ్.చిన బాబు దొర, జెవిబి.రమణమ్మ, ఎ.గాంధీరెడ్డి, కమలరత్నం, బి.వెంకటేశ్వర్లు ఎన్నుకోబడ్డారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.










