క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న డిఇఒ లింగేశ్వరరెడ్డి
ప్రజాశక్తి-అనకాపల్లి
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్ ముద్రించిన 2023 క్యాలెండర్, డైరీలను జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వర్ రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుటిఎఫ్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. పదవ తరగతి విద్యార్థులకు నమూనా ప్రశ్నాపత్రం, టెస్ట్ పేపర్లు తయారు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చిన్నబ్బాయి, కోశాధికారి జోగా రాజేష్, అనకాపల్లి మండల ప్రధాన కార్యదర్శి దేముడు నాయుడు, అచ్యుతాపురం అధ్యక్షులు రవి, సీనియర్ నాయకులు జీకేఆర్ స్వామి, అలివేలు, సలీం, తేజ, వర్ధన తదితరులు పాల్గొన్నారు.










