Mar 21,2023 23:47

ప్రమాణ స్వీకారం చేస్తున్న నూతన కార్యవర్గం

ప్రజాశక్తి-సబ్బవరం
ఆంధ్ర ప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) మండల నూతన కార్యవర్గం ఎన్నిక మంగళవారం జరిగింది. స్థానిక మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం యుటిఎఫ్‌ మండల కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి, యాప్‌ల ఆన్లైన్‌ వర్కు నుంచి విముక్తి కలిగించాలని కోరారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేసి, పాఠశాలను బలోపేతం చేయాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం యుటిఎఫ్‌ సబ్బవరం మండలం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల గౌరవాధ్యక్షుడుగా బి.నాగరాజు, అధ్యక్షులుగా సిహెచ్‌.భాస్కరరావు, ప్రధాన కార్యదర్శిగా పి.తమ్మారావు, ఉపాధ్యక్షులుగా కెవి.రమణ, సహాధ్యక్షులుగా భీమేశ్వరిదేవి, కోశాధికారిగా ఎస్‌కె.అజారుద్దీన్‌, కార్యదర్శులుగా ఎన్‌. సోమేశ్వరరావు, త్రివేణి , భాస్కరరావు, జిల్లా కౌన్సిలర్‌గా బిఎస్‌ గోవింద, కె. విశ్వనాథం ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి అభినందించారు.