ప్రజాశక్తి- పొందూరు: మండల శాఖ యుటిఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా పి.జగదీశ్వరరావు, అధ్యక్షులుగా జి.గోపాలరావు, సహాధ్యక్షులుగా ఎన్.కిషోర్‌కుమార్, మహిళా అధ్యక్షులుగా అనురాధజ్యోతి, ప్రధాన కార్యదర్శిగా కె.వి.ఎం.సత్యనారాయణ, కోశాధికారిగా జి.వాసుదేవరావు, కార్యదర్శులుగా పి.కృష్ణ, పి.రవి, పి.కృష్ణారావు, డి.శివజ్యోతి, పి.తేజేశ్వరరావు, కె.ఉత్తరలక్ష్మి, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా జి.గోపాలరావు, కెవిఎం.సత్యనారాయణ, ఎన్.కిషోర్‌కుమార్, పి.సత్యనారాయణ, మధుబాబు, కె.మల్లేశ్వరరావు, కె.లోకనాథం, బి.రాజు, జి.మురళీమోహనరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక పరిశీలకులుగా యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు వ్యవహరించారు.