Mar 21,2023 18:08

ప్రమాణ స్వీకారం చేస్తున్న యుటిఎఫ్‌ జిల్లా నూతన కమిటీ

యుటిఎఫ్‌ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి - నంద్యాల

        నంద్యాలలోని నిశాంత్‌ భవన్‌లో జరిగిన యుటిఎఫ్‌ ప్రథమ కౌన్సిల్‌ సమావేశంలో జిల్లా నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడుగా ఎస్‌.జాకీర్‌ హుస్సేన్‌, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పివి.ప్రసాద్‌, జె.సుధాకర్‌, సహాధ్యక్షులుగా కె.సత్య ప్రకాశం, ఎన్‌.శాంతిప్రియ, కోశాధికారిగా బాబా ఫకృద్దీన్‌, కార్యదర్శులుగా రాంమోహన్‌, పి.రామానంద కిషోర్‌, ఎస్‌.అమీర్‌ అహ్మద్‌, రామ కృష్ణుడు, షమీమ్‌ భాను, సంధ్యారాణి, జి.రాముర్తి, పిసిహెచ్‌.బాల స్వామి, వెంకట ప్రభాకర్‌ రెడ్డి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా జె.రఫీ అహ్మద్‌, సభ్యులుగా యు. దస్తగిరి, బి.వేంకటేశ్వర్లు, సాయిప్రసాద్‌, విజరు కుమార్‌లు ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్‌లుగా ఎం.ఐజయ్య, నాగ స్వామి నాయక్‌, ఎన్‌.శాంతి ప్రియలు ఎన్నికయ్యారు. అంతకుముందు జిల్లా అధ్యక్షుడు పివి ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గత ఆరు నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకొని, భవిష్యత్‌ కర్తవ్యాలను నిర్దేశించుకున్నారు. జిల్లాలో ప్రభుత్వ, మున్సిపల్‌, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ఐటిడిఎ, ఆశ్రమ, మోడల్‌ స్కూల్‌, కస్తూరిబా పాఠశాలల సమస్యలు, అందుకనుగుణంగా కార్యాచరణపై చర్చించారు.