
పార్వతీపురం: యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.రమేష్, ఎస్.మురళీమోహనరావు తిరిగి ఎన్నికయ్యారు. జిల్లా రెండో కౌన్సిల్ సమావేశం సోమవారం స్థానిక వేదాంత కళాశాలలో సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షలు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు హాజరైనారు. వీరి సమక్షంలో జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా గౌరవాధ్యక్షులుగా ఎ.భాస్కరరావు, అధ్యక్షుగా టి.రమేష్, సహాధ్యక్షులు బి.విజరుకుమార్, వి.జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా ఎస్.మురళీమోహనరావు, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఐ.రోజారమణి, పిబి రాయుడు, పి.మధు, ఎస్.రాజకుమారి ఎన్నికయ్యారు. అనంతరం సమావేశంలో పలు భవిష్యత్ కర్తవ్యాలు తీసుకున్నారు. వీటిలో జిఒ 117 రద్దు కోసం సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలని, జిపిఎస్‌పై సమరశీల, రాజకీయ పోరాటం చేయాలని, డిఎ, పిఆర్‌సి, పిఎఫ్, జిఎల్‌ఐసి బకాయిలపై పోరాడాలని, గిరిజన విద్యరంగానికి 117 జిఒ అమలను అంగీకరించరాదంటూ తీర్మానించారు.