గిరిజనులకు దుప్పట్లు, విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేత
ప్రజాశక్తి-విఆర్.పురం : కాకినాడ, కోనసీమ, అంబేద్కర్ జిల్లాల యుటిఎఫ్ సహాకారంతో గురువారం జల్లివారిగూడెం గ్రామంలోని 70 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే చింతరేపల్లి గ్రామంలోని ఎంపియుపి పాఠశాలలోని 165 మంది విద్యార్థులకు దుప్పట్లు నోట్ బుక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా యుటిఎఫ్ మండల అధ్యక్షప్రధాన కార్యదర్శులు కె. వెంకటేశ్వర్లు, నూనె జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు సోడే నాగేశ్వరరావు మాట్లాడుతూ, గిరిజన గ్రామాల్లోని విద్యార్థులకు, ప్రజలకు కాకినాడ, కోనసీమ, అంబేడ్కర్ ఉమ్మడి జిల్లాల యుటిఎఫ్ నాయకులు సహాయం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో యస్.అజరుకుమార్ యం.బాబు, సిహెచ్.వెంకన్నబాబు జె.బాబురావు, కె.వెంకట్, ఒ.మంగారెడ్డి, ఎన్.ప్రసాద్ ఎన్.రామకృష్ణ, ఉపాధ్యాయులు ఎంఎస్..కల్యాణి, కె.వెంకన్న, పాల్గొన్నారు.










