Mar 09,2023 00:59
ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సన్మానిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల జిల్లా యుటిఎఫ్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యుటిఎఫ్‌ కార్యాలయం బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పలు విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కర్లపాలెం మండలం యాజలి జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం పి సంధ్యారాణి, బాపట్ల మున్సిపల్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం బి రాజశ్రీ, బాపట్ల ఎవివి హైస్కూల్‌ ఉపాధ్యాయిని వై సత్యవతిలను సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు వివిధ క్రీడలు నిర్వహించి విజేతలకు అందజేశారు. కార్యక్రమం లో జిల్లా యూటీఎఫ్‌ అధ్యక్షులు జే వినరు కుమార్‌, జిల్లా కోశాధికారి ఎం వెంకటేశ్వరరెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు వై భాస్కరరావు, నూతలపాటి కోటేశ్వరరావు, యుటి ఎఫ్‌ నాయకులు జి రాజేష్‌, వై రంగారెడ్డి, టీ నాగరామారావు, వైవి నారాయణ, పి వెంకటేశ్వర్లు, బివి శ్రీనివాస్‌, జెపి సుజాత, ఉపాధ్యాయులు, మహిళలు పాల్గొన్నారు.