నోట్ పుస్తకాలు అందజేస్తున్న యుటిఎఫ్ నాయకులు
ప్రజాశక్తి-విఆర్.పురం
మండలంలోని ఒడ్డుగూడెం పంచాయతీ పరిధి వడ్డిగూడెం ఎంపియుపి పాఠశాల విద్యార్థులకు ఎపి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) కాకినాడ జిల్లా కమిటీ సహకారంతో మంగళవారం నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ వరదల వల్ల ముంపునకు గురైన పాఠశాల విద్యార్థులకు యూటీఎఫ్ ఉపాధ్యాయుల సహకారంతో ఈ పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్షుడు కె.వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎన్.జగదీష్, నాయకులు ఓ.మంగరావురెడ్డి, అజరు, ప్రసాద్, వెంకటరెడ్డి, రమేష్ బాబు, గురుసాయి నవీన్, వెంకటేశ్వర్లు, శాంత, బాబు పాల్గొన్నారు.










