Dec 07,2022 23:18

5 కె వాక్‌ చేపడుతున్న యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌: సిపిఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యాన 5కె వాక్‌ ర్యాలీ బుదవారం అరకులోయ ఎన్‌టిఆర్‌ గ్రౌండ్‌ నుండి తహశీల్దార్‌ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మహేశ్వరరావు మాట్లాడుతూ, 2004 సెప్టెంబర్‌ తర్వాత నియామకం పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాల ఆరు నెలలు గడిచినా సిపీఎస్‌ విధానం రద్దు చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిపీ ఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా కార్యదర్శి టీ.చిట్టిబాబు, ఎం.బాబురావు, ఎస్‌.కన్నయ్య, పి.దేవుడు, రామ్‌ చందర్‌, రాజ్‌ కుమార్‌, మహిళా నాయకులు పార్వతమ్మ, భూలక్ష్మి, అప్పలమ్మ, సిపిఎస్‌ కన్వీనర్‌ ఎల్‌.నారాయణ, ఎస్‌.నారాయణ పాల్గొన్నారు.