
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు, ఆయన కుటుంబీకులపై శనివారం కొందరు దుండగులు దాడి చేశారు. సోంఖ్ రోడ్డులో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. దాడికి గురైన జర్నలిస్టు అనిల్ అగర్వాల్ జాతీయ దినపత్రికలో పనిచేస్తున్నారని చెప్పారు. జర్నలిస్టుతో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులను వైద్య సాయం అందించినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ తివారీ వెల్లడించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత ...ఘటనాస్థలికి వెళ్లి నలుగురు నిందితుల్ని అరెస్టు చేశామని చెప్పారు. నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపామని, ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. అయితే ఈ దాడికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు.