న్యూఢిల్లీ : యుపిలోని యోగి కేబినెట్‌కి మరో మంత్రి ఉద్వాసన పలికారు. మంగళవారం ఒబిసి కీలక నేత స్వామి ప్రసాద్ మౌర్య బిజెపికి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఒబిసి నేత, మంత్రి దారా సింగ్ చౌహాన్ పార్టీని వీడారు. తాను అంకిత భావంతో పనిచేశానని, అయితే వెనకబడిన తరగతులైన దళితులు, రైతులు, నిరుద్యోగ యువతపై యోగి ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలు తనను బాధించాయని దారాసింగ్ చౌహాన్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వారికి అందాల్సిన కోటాపై బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తాను ఇప్పటివరకు ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు బిజెపిని వీడి సమాజ్‌వాది పార్టీలో చేరారు. దేశంలోనే రాజకీయంగా అత్యంత కీలకమైనవిగా భావించే యుపి ఎన్నికల సమయంలో పలువురు నేతలు పార్టీని వీడటం బిజెపికి భారీ దెబ్బ కానుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.










