Dec 21,2022 23:52

ప్రసాద్‌ను సత్కరిస్తున్న డాక్‌యార్డు రిటైర్డు ఉద్యోగులు

ప్రజాశక్తి -కరాస: నేవల్‌ సివిల్‌ యూనియన్‌ ఉద్యోగులకు అత్యున్నత సేవలు అందించిన కెబిఆర్‌ఆర్‌ .ప్రసాద్‌ను బుధవారం ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శాంతినగర్‌ హస్మీ భవనంలో డాక్‌యార్డ్‌ ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌ విశ్రాంత ఉద్యోగులు గజమాలతో సత్కరించి, అభినందిచారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ సేవలను కొనియాడారు. కార్మిక సంఘం నేతగా, కార్మికుల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడ్డారన్నారు. ఐఎస్‌సిఈ యూనియన్‌కు దీర్ఘకాలంపాటు గౌరవాధ్యక్షునిగా కొనసాగి సేవలు అందించారన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌కె.రాజు, జి శ్యాంప్రసాద్‌, ఎం చంద్రశేఖర్‌, మౌలాలి, టి రామ్మోహనరావు, ఆర్‌.కొండబాబు, పిఎస్‌ఎన్‌ మూర్తి, పిఆర్‌ కుమార్‌, టివి.రమణ, ఎంఎస్‌ లింగం ఎంపీ దత్తు తదితరులు పాల్గొన్నారు.