కడప అర్బన్ : ఉన్నత విద్యారంగంలో వి లువల ఆవశ్య కతను గుర్తు చేస్తూ 'యూనివర్సిటీ' పే రుతో సినిమా తీశానని అందరూ ఆదరించాలని ప్ర ముఖ సినీ నిర్మాత, దర్శకులు, నటులు ఆర్. నారాయణ మూర్తి విజ్ఞప్తి చేశారు. మంగళవారం యోగి వేమన విద్యాలయానికి వచ్చి విసి ప్రొఫెసర్ చింత సుధాకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా నూతన ఉపకులపతితో మాట్లాడారు. యూని వర్సిటీ పేరుతో త్వరలో విడుదల కానున్న సినిమా మొత్తం విద్యారంగం చుట్టూ ఉంటుందని వివరించారు. సినిమా అంటే వినోదం మాత్రమేగాక సమాజానికి ఉపయోగపడే అంశాలు చెప్పగలగాలని తెలిపారు. విదేశీ విద్యా విధానం, అక్కడ అక్కడి పరిశోధనలపై ఇందులో ప్రస్తావన ఉందని వివరించారు. సందేశాత్మకంగా చిత్రాన్ని రూపకల్పన చేశామని అన్నారు. విద్యా రంగాన్ని ప్రధాన అంశంగా తీసుకుని యువతను చైతన్యం చేసేలా సినిమా తీయడం పట్ల విసి నారాయణ మూర్తిని అభినందించారు. ప్రజల బాధ్యతలను గుర్తుచేసే చక్కటి మార్గాన్ని చూపే ఏ సినిమా అయినా ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. అలాంటి ఆదరణ ఈ చిత్రానికి లభించాలని ఆకాక్షించారు. అనంతరం ఆర్.నారాయణమూర్తిని ఘనంగా సత్కరించారు.










