Aug 21,2023 00:10

'యూనివర్సిటీ' సినిమాను ఆదరించండి
ప్రజాశక్తి - క్యాంపస్‌: విశ్వవిద్యాలయాలలో పోటీ పరీక్షల కోసం చదివే నిరుపేద విద్యార్థుల కష్టనష్టాలను ప్రత్యక్షంగా సామాజిక కోణంలో చూపించి, నిరుద్యోగ యువత కోసం తీసిన సినిమా యూనివర్సిటీ సినిమాని ఆదరించాలని ప్రముఖ దర్శకుడు ఆర్‌.నారాయణ మూర్తి యూనివర్సిటీ విద్యార్థులను కోరారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో 'యూనివర్సిటీ' అనే సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 'యూనివర్సిటీ' అనే సినిమాను నిర్మించాలని రెండు తెలుగు రాష్ట్రాలను కాకుండా దేశంలోని అన్ని రకాల విశ్వవిద్యాలయాలలో చదివే యువత, నిరుద్యోగులు, నిరుపేద బడుగు బలహీన వర్గాల అందరికీ వారి యొక్క జీవన పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను, సామాజిక పరిస్థితులను పూర్తిస్థాయిలో ప్రతిబింబించే విధంగా చిత్రీకరణ చేయడం జరిగిందన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లిదండ్రులకు చదువులను కొనసాగిస్తూ నోటిఫికేషన్లు పేపర్‌ లీకేజీలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నా వారిని చూపించడం జరిగిందన్నారు. విద్యార్థులారా యూనివర్సిటీ సినిమాలు సామాజిక కోణంలో అన్ని విషయాలను పాటల రూపంలో కూడా తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దయచేసి 'యూనివర్సిటీ' సినిమా చూసి సినిమా అంశాలను దష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఉన్నతంగా చదివి చదువులలో రాణించాలని, ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. కార్యక్రమంలో పాటల రచయిత రమేష్‌, హరీష్‌, విద్యార్థి సంఘం నేతలు మాధవ కష్ణ, మల్లికార్జున, సదాశివ, సుందర్‌ రాజు, రామకష్ణ నాయుడు, అశోక్‌, సుబ్రహ్మణ్యం, విద్యార్థులు ఉన్నారు.