ప్రజాశక్తి-కందుకూరు :ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ అటానమస్ హోదా సాధించినట్లేనని, త్వరలో యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని కరస్పాండెంట్ కంచర్ల రామయ్య, కోశాధికారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వెల్లడించారు. అటానమస్ హోదా సాధన నేపథ్యంలో ఆదివారం జరిగిన వెల్ విషర్స్, స్నేహితులు, సిబ్బంది గెట్ టుగెదర్ లో వారి లక్ష్యాన్ని ప్రకటించారు. కాలేజీ స్థాపన సంకల్పాల సాధనలో పలు మైలురాళ్లు దాటి విజjయం సాధించామన్నారు. ఫలితంగా ఈనాడు ప్రపంచంలో పలు దేశాలలో ప్రకాశం విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలలో అలరారుతున్నారన్నారు. అకడమిక్స్ లో సమర్థత వంతులుగా తీర్చిదిద్దేందుకు నిపుణుల కమిటీని రూపొందిస్తున్నామన్నారు. సభాధ్యక్షులు, ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం, నాలెడ్జి పెరుగుదలకు యాజమాన్యం అందిస్తున్న సహకారం ఎనలేనిదని వివరించారు.టెక్నికల్ డైరెక్టరు డాక్టర్ కంచర్ల విజయ శ్రీనివాస్ మాట్లాడుతూ కరస్పాండెంట్ రెండు దశాబ్దాల నిరంతర శ్రమ ప్రకాశం విజయదోహదానికి కారణమన్నారు. సెంట్రల్ బ్యాంక్ పూర్వ డైరెక్టరు జి.అయ్యన్న, మద్దిపాడు మండల పూర్వ అధ్యక్షులు నాగేశ్వరరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.రాఘవ, జి.కళ్యాణ్, డాక్టర్ మల్లి కార్జున రావు పాల్గొన్నారు. కందుకూరు లోని పలు విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు కూడా హాజర య్యారు. కాలేజీ ఎఒ వి.హరిబాబు, అకడమిక్ చైర్మన్, సహాయ చైర్మన్ ఎస్.ఎన్. మీరావళి, జి .ప్రసా దులు, సిఎస్‌ఇ హెచ్‌ఒడి ఎం.ఎం. రాయుడు, ఎన్.మాధవరావు, డాక్టర్ దస్తగిరి, డాక్టర్ పావని,ఇసిఇ ఐసి హెచ్‌ఒడి జి.సురేష్, మెకానికల్ హెచ్‌ఒడి డాక్టర్ జి.పున్నారావు, డాక్టర్ సింగయ్య పాల్గొన్నారు.










