పాల డబ్బాలు ఇస్తున్న సురేంద్ర
ప్రజాశక్తి- డుంబ్రిగుడ: మండలంలోని అరకు సంత బయలు వద్ద యూనిటీ ఫర్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులేని చంటి పిల్లలకు గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర చేతుల మీదుగా పాల డబ్బాలను పంపింణి చేశారు. అనంతరం సురేంద్ర మాట్లాడుతూ, యూనిటీ ట్రస్టు చేస్తున్న సేవలు మరువలేవన్నారు. అనాధ పిల్లలకు, చదువు కుంటున్న ఆర్థిక స్థోమత లేని నిరుపేద పిల్లలకు పాఠశాలల్లో, కళాశాలలో ఫీజులు చెల్లిస్తూ గిరి విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు నీలి నారాయణరావు, నీలి మేరీ జోష్ ఫిన్, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.










