
యూనిఫాం అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :శ్రీనివాస పెట్రోల్ బంకు యజమాని కుందూరు రమణా రెడ్డి శ్రీ చైతన్య ప్రైమరీ,హైస్కూలు, కందుకూరు, కోటారెడ్డి నగర్ బ్రాంచ్ స్కూలు బస్సు డ్రైవర్లకు మంచి మనసుతో యూనిఫాం, ఆర్థిక సాయాన్ని మంగళవారం అందజేశారు. శ్రీ చైతన్య యాజమాన్యం, ప్రిన్సిపాల్ బి.సురేష్ , అర్‌ఐ అనిల్ కుమార్, ఎఓ సురేష్ నాయుడు , జిల్లా ట్రాన్స్ పోర్ట్ ఇంఛార్జి ఆకుల మోహన్ పెట్రోల్ బంకు యజమాని కుందూరు రమణా రెడ్డిని అభినందించారు. శ్రీ చైతన్య స్కూలు సిబ్బంది, బస్సు డ్రైవర్లు, పెట్రోల్ బంకు మేనేజర్ శ్రీవాసులు వర్కర్లు పాల్గొన్నారు.